Mahesh Babu: క్రికెట్ గ్రౌండ్ లో మహేశ్ బాబు ఫైట్!

షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబు తన 25వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా .. షూటింగు దశలో వుంది. ఈ సినిమాలో మహేశ్ బాబు .. కాలేజ్ స్టూడెంట్ గా కనిపించనున్నాడు. కాలేజ్ అనగానే రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈ గొడవలకి ప్లే గ్రౌండ్ వేదికగా మారుతూ వుంటుంది.

 ప్లే గ్రౌండ్ లో కాలేజ్ కుర్రాళ్ల మధ్య జరిగిన గొడవలను గతంలో చాలా సినిమాల్లో చూపించారు. అందుకు భిన్నంగా చూపించడానికే వంశీ పైడిపల్లి తనవంతు ప్రయత్నం చేశాడట. మహేశ్ బాబు .. తదితరులపై కొన్ని రోజులుగా యాక్షన్ సీన్ ను చిత్రీకరిస్తూ వచ్చారట. క్రికెట్ ఆడుతూ ఉండగా .. రెండు వర్గాలమధ్య గొడవ మొదలుకావడం .. అది ఫైటింగ్ కి దారితీయడం జరుగుతుందని చెబుతున్నారు. ఈ యాక్షన్ సీన్ మహేశ్ అభిమానులతో విజిల్స్ వేయించేలా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే .. మహేశ్ జోడీకడుతుందనే సంగతి తెలిసిందే.    
Go Back to Shorts
Mahesh Babu
pooja hegde

More Telugu News