Chandrababu: మెజారిటీ ఉందని నీతి, ధర్మం తప్పారు: చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
మెజారిటీ ఉందన్న ఒకే ఒక్క కారణంతో ప్రధాని నరేంద్రమోదీ నీతి, ధర్మం తప్పారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంతటి బాధ్యతారహితమైన ప్రభుత్వాన్ని తానెప్పుడూ చూడలేదన్నారు. లోక్‌సభలో మోదీ ప్రసంగంపై స్పందిస్తూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

  హోదా కోసం చివరి అస్త్రంగానే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌పై మళ్లీ అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన మోదీ.. తెలుగు జాతి దేశభక్తిని శంకించారని ఆరోపించారు. హామీల విషయంలో చెప్పిందే చెప్పారని, ఆయన ప్రసంగంలో కొత్తదనం ఏదీ లేదని చంద్రబాబు కొట్టి పడేశారు.
Go Back to Shorts
Chandrababu
Narendra Modi
Telugudesam
BJP

More Telugu News