akhil: అఖిల్ తో ఐటమ్ సాంగ్ కి ఆ భామనే ఎంపిక చేశారు!

షార్ట్స్‌లో చూడండి
అఖిల్ తన మూడవ సినిమా షూటింగులో బిజీగా వున్నాడు . . ఈ సినిమాకి 'మిస్టర్ మజ్ను' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ కనిపించనుంది. ఈ సినిమాలో హాట్ హాట్ గా ఒక ఐటమ్ సాంగ్ వుంటుందట. ఈ సాంగ్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలిచేలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు.

ఈ ప్రత్యేక గీతం కోసం 'ఫరా కరిమి' పేరును పరిశీలిస్తున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆమెనే ఖరారు చేశారనేది తాజా సమాచారం. అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం .. దర్శక నిర్మాతలు ఆమెను ఎంపిక చేయడం జరిగిపోయిందని అంటున్నారు. 'ధ్రువ' సినిమాలో అరవిందస్వామి గాళ్ ఫ్రెండ్ గా .. 'గౌతమీ పుత్ర శాతకర్ణి'లో గ్రీకురాణిగా ఆమె మెరిసింది. ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ ఆమె క్రేజ్ ను పెంచడం ఖాయమని అంటున్నారు.      
Go Back to Shorts
akhil
nidhi agarwal

More Telugu News