శశిథరూర్ కార్యాలయంపై దాడి చేసిన బీజేపీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శశిథరూర్ కార్యాలయంపై దాడి చేసిన బీజేపీ

  • బీజేపీపై ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన థరూర్
  • బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. హిందూ పాకిస్థాన్ వస్తుందంటూ వ్యాఖ్య
  • థరూర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ శ్రేణులు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కేరళ, తిరువనంతపురంలో సిటీ సెంటర్ లోని ప్రభుత్వ ప్రెస్ కార్యాలయం సమీపంలోని థరూర్ కార్యాలయంలోకి సుమారు 15 మంది బీజేపీ కార్యకర్తలు చొరబడ్డారు. కార్యాలయం ముందు నల్ల ఇంకు పూశారు. థరూర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడి జరిగిన సమయంలో థరూర్ కార్యాలయంలో లేరు.

రానున్న ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే... ఆ పార్టీ సొంత రాజ్యాంగాన్ని రాసుకుంటుందని, సొంత చట్టాలను తెస్తుందని థరూర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. హిందూ పాకిస్థాన్ గా భారత్ మారిపోతుందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే, ఆయన కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. శశిథరూర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని, దేశం విడిచి వెళ్లిపోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
sasi tharoor
bjp
congress

More Telugu News