Mahesh Babu: మహేశ్ మూవీలో పూజా హెగ్డే పాత్ర ఇదేనట!

షార్ట్స్‌లో చూడండి
తెలుగులో 'దువ్వాడ జగన్నాథం' సినిమాతో పూజా హెగ్డే దశ తిరిగిపోయిందనే చెప్పాలి. ఈ సినిమాలో గ్లామర్ పరంగా ఆమె మంచి మార్కులు కొట్టేసింది. యూత్ నుంచి .. మాస్ ఆడియన్స్ నుంచి కావాల్సినంత క్రేజ్ తెచ్చుకుంది. దాంతో సహజంగానే ఆమెను తమ సినిమాల్లోకి తీసుకోవడానికి అగ్రదర్శకులు సైతం ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఫలితంగా ఆమె ఎన్టీఆర్ .. మహేశ్ బాబు .. ప్రభాస్ సినిమాల్లో వరుసగా ఛాన్సులు కొట్టేసింది.

 ప్రస్తుతం ఆమె మహేశ్ బాబు 25వ సినిమా షూటింగులో బిజీగా వుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగు 'డెహ్రాడూన్'లో జరుగుతోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర ఎలా వుండనుందనే ఆసక్తి అభిమానుల్లో వుంది. 'వీడియో గేమ్ డెవలపర్' గా ఈ సినిమాలో ఆమె కనిపిస్తుందనేది తాజా సమాచారం. ఈ సినిమాలో ఆమెను మరింత గ్లామరస్ గా చూపించనున్నారట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాలో, అల్లరి నరేశ్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే. 
Go Back to Shorts
Mahesh Babu
pooja hegde

More Telugu News