'ఈ నగరానికి ఏమైంది' సినిమాపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన కేటీఆర్

  • సినిమాలో ఒక్క స్టార్ కూడా లేడని తరుణ్ చెప్పడంతో ఆశ్చర్యపోయా
  • స్టార్లను కాకుండా, కథలను నమ్మి సినిమాలు తీయాలి
  • తరుణ్ కుటుంబంతో నాకు మంచి పరిచయం ఉంది
వర్షాకాలం వచ్చిందంటే చాలు... ఈ నగరానికి ఏమైంది? అంటూ వార్తాపత్రికల్లో పెద్ద పెద్ద హెడ్డింగులు పెట్టి వార్తలు రాస్తుంటారని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ సినిమా కూడా అలాంటిదేనేమో అనుకున్నానని... అలాంటి కథ కాదని తర్వాత తెలిసిందని చెప్పారు. 'ఈ నగరానికి ఏమైంది' సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ నిన్న రాత్రి హైదరాబాదులో జరిగింది. ఈ వేడుకకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఒక్క స్టార్ కూడా లేకుండానే ఈ సినిమాను తీశానని దర్శకుడు తరుణ్ భాస్కర్ చెప్పడంతో, ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పారు. తరుణ్ కుటుంబంతో తనకు మంచి పరిచయం ఉందని, కానీ సినిమాకు సంబంధించిన విషయాలను ఎప్పుడూ మాట్లాడేవాడు కాదని తెలిపారు. తరుణ్ ఇదే విధంగా ముందుకు సాగాలని... స్టార్లను కాకుండా, మంచి కథలను నమ్మి సినిమాలను తెరకెక్కించాలని అభిలషించారు. 
Go Back to Shorts
KTR
tarun bhaskar
tollywood
ee nagaraniki emaindi

More Telugu News