Mahesh Babu: మహేశ్ బాబు 25వ మూవీ రిలీజ్ అప్పుడేనట!

షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం మహేశ్ బాబు తన 25వ సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, 'డెహ్రాడూన్' లో షూటింగు జరుపుకుంటోంది. ప్రధానమైన పాత్రల కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ సంక్రాంతి బరిలోకి దిగుతోన్న సినిమాల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది.

క్రిష్ దర్శకత్వం వహిస్తోన్న 'ఎన్టీఆర్' బయోపిక్ .. బోయపాటి - చరణ్ మూవీతో పాటు అనిల్ రావిపూడి 'ఎఫ్ 2' సినిమా కూడా సంక్రాంతికి విడుదల కానున్నాయి. అదే సమయంలో రిలీజ్ పెట్టుకుంటే థియేటర్ల సమస్య వస్తుందనీ .. షూటింగు విషయంలోను టెన్షన్ పడవలసి వస్తుందని దర్శక నిర్మాతలతో పాటు మహేశ్ బాబు భావించాడట. అందుకే  ఈ సినిమాను ఏప్రిల్ లో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. 'పోకిరి' .. 'భరత్ అనే నేను' ఏప్రిల్ లోనే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన విషయం తెలిసిందే.   
Go Back to Shorts
Mahesh Babu
pooja hegde

More Telugu News