kanna: సొమ్మొకడిది సోకొకడిది అన్నట్టుగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది: కన్నా లక్ష్మీనారాయణ

షార్ట్స్‌లో చూడండి
సొమ్మొకడిది సోకొకడిది అన్నట్టుగా టీడీపీ వ్యవహరిస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. మాజీ ఎంపీ యలమంచిలి శివాజీని ఈరోజు ఆయన కలుసుకున్నారు. బీజేపీ పథకాలు, అభివృద్ధికి సంబంధించిన బుక్ లెట్ ను శివాజీకీ అందజేశారు. అనంతరం, కన్నా మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర పథకాలను తెలిపేందుకు సంపర్క్ అభియాన్ కార్యక్రమం చేపడుతున్నట్టు చెప్పారు.

దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఎలా ఉంటుందో, టీడీపీ వాళ్లు మాట్లాడితే అలా ఉంటుందని ఎద్దేవా చేశారు. ఏపీలో టీడీపీ-వైసీపీ కో-రిలేషన్ ప్రభుత్వం లేదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని చెప్పమనండి అని ప్రశ్నించారు. కాగా, బీజేపీ నేత పురందేశ్వరి మాట్లాడుతూ, జగన్, పవన్ తో కలిసి బీజేపీ పనిచేస్తోందనడం అబద్ధమని అన్నారు. ఢిల్లీలో నిన్న జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు లేవనెత్తిన అంశాలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేదనేది అసత్య ప్రచారమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని అన్నారు.
Go Back to Shorts
kanna
Telugudesam
bjp

More Telugu News