పాత ఫోన్లకు నిలిచిపోయిన వాట్సాప్ సేవలు
- ఆండ్రాయిడ్ 2.3.3 కంటే ముందు వెర్షన్లకు బంద్
- ఐవోఎస్ 6, బ్లాక్ బెర్రీ 10కు సైతం
- తదుపరి వెర్షన్లకు అప్ గ్రేడ్ కావాలని సూచన
అయితే, ఆయా వెర్షన్లపై ఇప్పటికే వాట్సాప్ వాడుతున్న వారు మరికొంత కాలం పాటు ఆ సేవలు పొందొచ్చని స్పష్టం చేసింది. నోకియా ఎస్40 కలిగి ఉన్న వారు ఈ ఏడాది డిసెంబర్ చివరి వరకు, ఆండ్రాయిడ్ 2.3.3, 2.3.7 ఉన్నవారు 2020 ఫిబ్రవరి 1 వరకు, ఐవోఎస్ 7 యూజర్లు 2020 ఫిబ్రవరి 1 వరకు వాట్సాప్ సేవల్ని పొందొచ్చని తెలియజేసింది. వాట్సాస్ సేవల కోసం యూజర్లు తదుపరి వెర్షన్లకు అప్ గ్రేడ్ కావాలని సూచించింది.