Mahesh Babu: 25వ మూవీ కోసం మహేశ్ బాబుకి బాలీవుడ్ స్టైలిస్ట్

షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబు తన 25వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. త్వరలోనే ఈ సినిమా టీమ్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు ముంబై వెళ్లిరావడంతో .. ఆయన బాలీవుడ్ మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయనే ప్రచారం ఊపందుకుంది. అయితే మహేశ్ బాబు ముంబై వెళ్లి వచ్చింది .. హకీమ్ ఆలిమ్ కోసమట.

ఆయన ఎవరో కాదు బాలీవుడ్ లో ఫేమస్ స్టైలిస్ట్. బాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరోలకి ఆయన స్టైలిస్ట్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆయన పర్యవేక్షణలోనే మహేశ్ తన నెక్స్ట్ మూవీలో కనిపించనున్నాడు. తన న్యూ లుక్ కి సంబంధించి మహేశ్ బాబు ముంబై వెళ్లి .. ఆయన గైడెన్స్ తీసుకుని వచ్చాడట. ఈ సినిమా షూటింగు మొదలుకాగానే హకీమ్ ఆలీమ్ హైదరాబాద్ వస్తాడని సమాచారం. మహేశ్ కెరియర్లో సంఖ్యా పరంగా ఈ సినిమా ప్రత్యేకతను సంతరించుకోవడంతో, లుక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు.  
Go Back to Shorts
Mahesh Babu
pooja hegde

More Telugu News