సన్నబడిన హన్సిక .. తెలుగు సినిమాల్లో అవకాశాలపై ఆసక్తి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సన్నబడిన హన్సిక .. తెలుగు సినిమాల్లో అవకాశాలపై ఆసక్తి

  • కోలీవుడ్ లో అగ్రనాయిక అనిపించుకున్న హన్సిక 
  • ఈ మధ్య కాలంలో పలకరించని సక్సెస్ లు 
  • జోరు తగ్గడంతో టాలీవుడ్ వైపు చూపులు        
తమిళనాట వెండితెరపై బొద్దుగా వుండే భామలకు క్రేజ్ ఎక్కువ. ఖుష్బూ .. నగ్మా .. మీనా .. నమిత .. నిన్న మొన్నటి వరకూ హన్సిక అక్కడ ఒక వెలుగు వెలగడానికి కారణం ఇదే. ఈ కారణంగానే బొద్దుగా ఉండటానికే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఈ కథానాయికలంతా తమ హవాను కొనసాగించారు. అయితే తెలుగు సినిమాల విషయానికి వచ్చేసరికి ఇక్కడి ప్రేక్షకులు నాజూకుగా వుండే కథానాయికలనే ఇష్టపడుతుంటారు.

హన్సిక బొద్దుగా ఉండటం వలన .. ఆ కారణంగా ఆమె తమిళంలో బిజీ కావడం వలన అడపాదడపా మాత్రమే తెలుగు సినిమాలు చేస్తూ వచ్చింది. ఈ మధ్య తమిళంలోను ఆమెకి చెప్పుకోదగిన హిట్లు లేవు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ పబ్లిక్ ఈవెంట్ కి వచ్చిన హన్సికను చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఎప్పటి నుంచి కసరత్తులు మొదలెట్టిందోగానీ ఆమె చాలా సన్నబడింది. తమిళంలో జోరు తగ్గడంతో తెలుగు సినిమాల్లో అవకాశాల కోసమే ఆమె సన్నబడిందనే టాక్ కూడా వినిపిస్తోంది. కారణమేదైనా హన్సిక చేసిన ప్రయత్నం ఫలించి .. తెలుగు సినిమాల్లో ఆమెకి ఛాన్సులు వస్తాయేమో చూడాలి.       
hansika

More Telugu News