యాక్షన్ తోను .. ఎమోషన్ తోను ఆసక్తిని రేకెత్తిస్తోన్న 'పంతం' టీజర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యాక్షన్ తోను .. ఎమోషన్ తోను ఆసక్తిని రేకెత్తిస్తోన్న 'పంతం' టీజర్

  • గోపీచంద్ 25వ మూవీగా 'పంతం'
  • కథానాయికగా మెహ్రీన్ 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు
గోపీచంద్ 25వ సినిమాగా చక్రి దర్శకత్వంలో 'పంతం' సినిమా రూపొందింది. రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాలో కథానాయికగా మెహ్రీన్ నటించింది. తాజాగా ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం టీజర్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ కి .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ వాటిపై ఈ టీజర్ ను కట్ చేశారు.

"ఫ్రీగా ఇళ్లిస్తాం .. కరెంట్ ఇస్తాం .. రుణాలు మాఫీ చేస్తాం .. ఓటుకు ఐదువేలు ఇస్తాం అనగానే ముందు వెనుక .. మంచి చెడు ఆలోచించకుండా ఓటేసేసి .. అవినీతిలేని సమాజం కావాలి .. కరెప్షన్ లేని కంట్రీ కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తాయ్" అంటూ కోర్టులో గోపీచంద్ ఎమోషనల్ గా చెప్పిన డైలాగ్ బాగా పేలింది. ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకునేదిగా వుంది. గోపీచంద్ మార్క్ యాక్షన్ తో సాగిన ఈ టీజర్ లో మెహ్రీన్ మరింత గ్లామర్ గా కనిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాను భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
gopichand
mehreen

More Telugu News