సన్నీ లియాన్ కు 'సారీ' చెప్పిన రాఖీ సావంత్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సన్నీ లియాన్ కు 'సారీ' చెప్పిన రాఖీ సావంత్!

  • గతంలో సన్నీపై రాఖీ వివాదాస్పద వ్యాఖ్యలు
  • ఏమీ తెలుసుకోకుండానే మాట్లాడాను
  • 'జజ్ బాత్'లో క్షమాపణలు చెప్పిన రాఖీ సావంత్
బాలీవుడ్ లో వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరైన రాఖీసావంత్, తాజాగా రాజీవ్ ఖండేల్ వాలా చాట్ షో 'జజ్ బాత్... సంగీన్ సే నమ్కీన్ తక్'లో పాల్గొన్న సందర్భంగా, హాట్ బ్యూటీ సన్నీలియాన్ కు క్షమాపణలు చెప్పింది. బిగ్ బాస్ సీజన్ 11 పోటీదారు అర్షిఖాన్ తో కలసి ఈ షోలో పాల్గొన్న రాఖీ, గతంలో తాను సన్నీ గురించి తెలుసుకోకుండా కొన్ని విమర్శలు చేశానని గుర్తు చేసుకుంది.

సన్నీలియాన్ ఇండస్ట్రీకి వచ్చి హిందీ చిత్రాలు చేయడం ప్రారంభించిన కొత్తల్లో, తాను కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశానని, అందుకు క్షమించాలని కోరింది. సన్నీ గురించి, ఆమె జీవితంలో పడిన కష్టాలను గురించి తనకా సమయంలో ఏ మాత్రం తెలియదని, ఏమీ తెలుసుకోకుండానే ఆమె సాగించిన ప్రయాణం గురించి వ్యాఖ్యానించడం తప్పేనని చెప్పింది. అప్పట్లో అలా అనుండాల్సింది కాదని అభిప్రాయపడింది.
Sunny Leone
Rakhi Sawant
Sorry

More Telugu News