Attili: టీడీపీకి రాజీనామా చేసిన ప.గో.జిల్లా నేత రంగరాజు... 27న వైకాపాలో చేరిక!

షార్ట్స్‌లో చూడండి
పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ కీలక నేత, 2014 ఎన్నికల్లో ఆ పార్టీ ఎన్నికల సమన్వయకర్తగా పని చేసిన అత్తిలి మాజీ ఎమ్మెల్యే  చెరుకువాడ శ్రీరంగనాథరాజు (రంగరాజు) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేస్తూ, తన లేఖను చంద్రబాబుకు పంపిన ఆయన, ఈ నెల 27న భీమవరంలో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు.

జిల్లా రైస్ మిల్లర్స్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన, గతంలో అత్తిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తొలుత కాంగ్రెస్ లో, ఆపై వైసీపీలో చేరిన ఆయన, ఆ తరువాత టీడీపీలో చేరారు. ఇప్పుడు తన మద్దతుదారుల ఒత్తిడితో వైసీపీలో చేరుతున్నానని వెల్లడించిన ఆయన, టీడీపీలో చంద్రబాబు తనకు సముచిత గౌరవాన్నే ఇచ్చారని చెప్పడం కొసమెరుపు.
Go Back to Shorts
Attili
Rangaraju
Telugudesam
Jagan
YSRCP

More Telugu News