రమణ దీక్షితులు ఆరోపిస్తున్న నగల సంగతేంటి?: నేడు చంద్రబాబు వద్దకు టీటీడీ పంచాయితీ!
- అర్చకుల పదవీ విరమణ నిర్ణయం తరువాత వివాదం
- పలు సంచలన ఆరోపణలు చేసిన రమణ దీక్షితులు
- నేడు చంద్రబాబుకు వివరణ ఇవ్వనున్న చైర్మన్, ఈవో
తిరుమలలో స్వామివారి నగలు కనిపించడం లేదని, విలువైన వజ్రాన్ని అధికారులు మాయం చేసి, తప్పుడు మాటలు చెబుతున్నారని మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు చేసిన విమర్శలపైనా చంద్రబాబు ఈ సమావేశంలో వివరణ కోరనున్నారని తెలుస్తోంది. ఆలయంలో జరుగుతున్న పూజా కైంకర్యాలు, నగల నిర్వహణ తదితర విషయాలపై భక్తుల్లో ఆందోళన కలుగకుండా చూసేందుకు తీసుకున్న చర్యలు, రమణ దీక్షితులు తొలగింపు తరువాత నెలకొన్న పరిణామాలను సీఎం చంద్రబాబుకు టీటీడీ చైర్మన్,ఈవోలు వివరించనున్నట్టు తెలుస్తోంది.