resort: రిసార్టు నుంచి వెళ్లిపోయిన కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే.. బీజేపీ క్యాంపుకి?

షార్ట్స్‌లో చూడండి
కర్ణాటక సీఎంగా బీజేపీ నేత యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తమకు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పుకుంటోన్న జేడీఎస్‌-కాంగ్రెస్‌ నేతలు తమ వెంట ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారు. నిన్న కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం తమ ఎమ్మెల్యేలను బెంగళూరులోని ఓ రిసార్ట్‌కు తరలించగా ఆ రిసార్టు నుంచి.. మస్కి అసెంబ్లీ నియోజక వర్గం ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్ కనపడకుండా పోయారు.

ఆయన కోసం కాంగ్రెస్ నాయకులు ఎంతగా ఆరా తీసినా ఫలితం లేకుండా పోయింది. బెంగళూరు నగరంలోని హెచ్ఏఎల్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రైవేటు విమానంలో ఆయన ఎక్కడికో వెళ్లిపోయారని కాంగ్రెస్‌ నేతలు చివరకు గుర్తించారు. ఆయన 2013, 2018లో మస్కి నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. అయితే, అంతకు ముందు 2008లో బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ప్రతాప్ గౌడ పాటిల్‌ను గాలి జనార్దన్ రెడ్డి సోదరుడే విమానం ఎక్కించారని తెలుస్తోంది.        
Go Back to Shorts
resort
Congress
Karnataka

More Telugu News