బెంగళూరు రిసార్ట్ లో 100 గదులను బుక్ చేసిన కాంగ్రెస్
- ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీని ఇవ్వని కన్నడ ఓటర్లు
- ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాగే పనిలో బీజేపీ
- ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు క్యాంప్ ను ఏర్పాటు చేసిన కాంగ్రెస్
ఇప్పటికే కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనిపించడం లేదనే వార్తలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. జేడీఎస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మీటింగ్ కు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో, తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరదీసింది. బెంగళూరులో ఉన్న ఈగిల్టన్ రిసార్ట్ లో 100 రూములను కాంగ్రెస్ బుక్ చేసినట్టు సమాచారం. రాజ్యసభ ఎన్నికల సమయంలో గుజరాత్ ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రిసార్టులోనే ఉంచడం గమనార్హం.