బీజేపీ నేతలే దాడి చేశారు: అలిపిరి ఘటనపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్
- టీడీపీ కార్యకర్తలు శాంతియుతంగానే నిరసన తెలిపారు
- అమిత్ షాపై బీజేపీ నేత కోలా ఆనంద్ అనుచరులే దాడి
- టీడీపీపై కుట్రలు పన్నుతున్నారు
ఒకవేళ తాము దాడి చేయాలని అనుకుంటే అమిత్ షా కాన్వాయ్‌నే అడ్డుకునే వారిమని అన్నారు. తమ పార్టీపై బీజేపీ, వైసీపీ నేతలు కలిసి కుట్రలు పన్నుతున్నారని, అలిపిరిలో తెలిపిన నిరసనను రాజకీయం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు చేస్తోన్న ధర్మ పోరాట దీక్షలు జయప్రదం కావాలని ఆయన ఆకాంక్షించారు.
కాగా, అంతకు ముందు ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేసి, రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు.