'పడి పడి లేచె మనసు' సాయిపల్లవి ఫస్టులుక్ రిలీజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'పడి పడి లేచె మనసు' సాయిపల్లవి ఫస్టులుక్ రిలీజ్

  • షూటింగు దశలో  'పడి పడి లేచె మనసు'
  • శర్వానంద్ సరసన సాయిపల్లవి
  • ప్రేమకథా నేపథ్యంలో సాగే కథ                   
'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసిన సాయపల్లవి, 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమాతో మరింత క్రేజ్ ను పెంచుకుంది. ఆ తరువాత ఆమె హను రాఘవపూడి దర్శకత్వంలో 'పడి పడి లేచె మనసు' సినిమా చేస్తోంది. శర్వానంద్ జోడీగా ఆమె ఈ సినిమాలో కనిపించనుంది. ప్రేమకథా నేపథ్యంతో కూడిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కోల్ కతాలో జరుగుతోంది. ఈ రోజున సాయిపల్లవి పుట్టినరోజు కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. 'హోలీ' పండగ నేపథ్యంలో ఆనందంతో సాయిపల్లవి డాన్స్ చేసే పోస్టర్ ఒకటైతే, శర్వానంద్ .. సాయిపల్లవి ఒకరిని ఒకరు ఆటపట్టించుకుంటూ పరుగులు తీస్తున్నట్టుగా వున్న పోస్టర్ మరొకటి. హను రాఘవపూడి ఎంచుకునే కథలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇక కథలో విషయం ఉంటేనే శర్వానంద్ .. సాయిపల్లవి ఓకే చెబుతారు. అందువలన ఈ సినిమాపై అందరిలోను ఆసక్తివుంది.                  
sharwanand
sai pallavi

More Telugu News