ఇక ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగస్వాములవుతాం: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌

  • ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు 
  • ప్రజలు, ప్రభుత్వం, ఉద్యమకారులకు అండగా ఉంటాం
  • హోదా సాధించే వరకు మా మద్దతు ఉంటుంది
తమిళనాడులో జల్లికట్టు అంశంలో స్పందించిన తెలుగు సినీనటులు ప్రత్యేక హోదా విషయంపై మాత్రం నోరువిప్పట్లేదంటూ విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ చర్చించి కీలక నిర్ణయం తీసుకుని ఈ రోజు ఓ ప్రకటన చేసింది.

ప్రత్యేక హోదా ఉద్యమంలో తాము కూడా భాగస్వాములవుతామని మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ పేర్కొంది. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు ప్రజలు, ప్రభుత్వం, ఉద్యమకారులకు తాము కూడా అండగా ఉంటామని తెలిపింది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినదించింది. 
Go Back to Shorts
maa
Special Category Status
Andhra Pradesh

More Telugu News