వాట్సాప్ లో డిలీట్ చేసినా సర్వర్లో ఆ ఫైల్ భద్రం... కావాలంటే మళ్లీ మళ్లీ డౌన్ లోడ్ చేసుకోవచ్చు!
- డిలీట్ చేసిన తర్వాత 30 రోజులు దాటినాగానీ సర్వర్లో ఫైల్స్ భద్రం
- మళ్లీ, మళ్లీ డౌన్ లోడ్ చేసుకునే అవకాశం
- బీటా వెర్షన్ దశలో ఫీచర్
అయితే ఈ ఫీచర్ ఇంతకుముందు కూడా వాట్సాప్ లో పార్షికంగా ఉంది. డిలీట్ చేసిన ఫైల్స్ 30 రోజుల వరకు వాట్సాప్ సర్వర్లో ఉండేవి. ఒకసారి డౌన్ లోడ్ చేసుకుంటే ఆ తర్వాత వాట్సాప్ సర్వర్ల నుంచి డిలీట్ అయిపోయేవి. అయితే ఈ ఫీచర్లో కంపెనీ మార్పులు చేసింది. డిలీట్ చేసిన ఫైల్స్ వాట్సాప్ సర్వర్ల నుంచి తొలగించకుండా అలానే ఉంటాయి. అంటే మళ్లీ డౌన్ లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటాయి. రెండు నెలల క్రితం ఫైల్స్ ను కూడా డౌన్ లోడ్ చేసుకోవ్చని, అంతుకుముందు ఫైల్స్ లో కూడా కొన్నింటిని పొందే అవకాశం ఉంటుందని వాబీటా ఇన్ఫో అనే సంస్థ వెల్లడించింది.