నా పిల్లలు నాలా కష్టపడకూడదు: సన్నీ లియోన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా పిల్లలు నాలా కష్టపడకూడదు: సన్నీ లియోన్

  • 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ద్వేషపూరిత మెసేజ్ లు వచ్చేవి 
  • వాటిని చూసి చాలా కుంగిపోయాను
  • నా తల్లిదండ్రులే నాకు అండగా నిలిచారు.
తాను ఎదుర్కొన్న కష్టాలు తన పిల్లలు పడకూడదని బాలీవుడ్ శృంగారతార సన్నీలియోన్ తెలిపింది. సన్నీ జీవితం ఆధారంగా ‘కరణ్‌ జీత్‌ కౌర్‌-ది అన్‌ టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ సన్నీ లియోన్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ, తాను 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తనను ద్వేషిస్తూ ఎందరో మెయిల్స్‌, మెసేజ్‌ లు పంపేవారని గుర్తు చేసుకుంది. వారు ఏ దేశానికి చెందిన వారు అన్నది పక్కన పెడితే, సమాజం ధోరణి అలా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ వయసులో అలాంటి అసభ్య పదాలు జీవితంపై చాలా ప్రభావం చూపుతాయని చెప్పింది. ఈ మెయిల్స్, మెసేజ్ లను చూసి తాను లోలోపల చాలా కుంగిపోయానని తెలిపింది.

ఆ సమయంలో తనకు తన తల్లిదండ్రులే అండగా నిలిచారని చెప్పింది. వాస్తవానికి వారికి ఇష్టం లేని రంగం ఎంచుకున్నప్పటికీ వారు తనకు అండగా నిలిచారని తెలిపింది. అందుకే తన జీవితం ఎలా ఉన్నా ప్రేమిస్తానని, అసలు మన జీవితంలో ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుందని పెద్దలు చెబుతుంటారని, తాను ఎదుర్కొన్న ఇబ్బందులు తన పిల్లలు ఎదుర్కోకూడదని చెప్పింది. వారు ఎంచుకున్న రంగాలను తాను ఇష్టపడినా, పడకున్నా... వారు మాత్రం ఆనందంగా ఉండాలని కోరుకుంది. కాగా, సన్నీలియోన్ ముగ్గురు పిల్లలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.
Sunny Leone
bio pic
interview

More Telugu News