sharwanand: శర్వానంద్ సినిమా కోసం కోటి రూపాయల సెట్

షార్ట్స్‌లో చూడండి
కథలో కొత్తదనం .. కథనంలో వైవిధ్యం ఉంటేనే శర్వానంద్ ఆ సినిమాను ఒప్పుకుంటాడు. అందువలన తమ కంటెంట్ వెరైటీగా ఉందనిపించిన దర్శకులే ఆయనను సంప్రదిస్తుంటారు. అలా కొత్తదనంతో కూడిన కథతో వచ్చిన సుధీర్ వర్మకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సితార ఎంటర్టైన్ మెంట్స్ వారు ఈ సినిమాను 20 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో శర్వానంద్ టూ షేడ్స్ తో కనిపిస్తాడని అంటున్నారు. ఈ సినిమా కోసం కోటి రూపాయల ఖర్చుతో ప్రతేకంగా ఒక సెట్ ను వేయించారట. చాలావరకూ షూటింగ్ ఈ సెట్లోనే జరుగుతుందని అంటున్నారు. శర్వానంద్ సినిమాకి 20 కోట్లకి పైగా ఖర్చు చేస్తుండటం .. కోటి రూపాయల ఖర్చుతో సెట్ వేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇక కథానాయికల విషయంలో త్వరలోనే క్లారిటీ రానుంది.         
Go Back to Shorts
sharwanand
sudheer varma

More Telugu News