chaitu: 'సవ్యసాచి'పై భారీ అంచనాలు .. ఫస్టు పంచ్ రేపే

షార్ట్స్‌లో చూడండి
చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా 'సవ్యసాచి' సినిమా రూపొందుతోంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, ఒక కీలకమైన పాత్రలో భూమిక కనిపించనుంది. ఈ సినిమాలో మాధవన్ విలన్ గా చేస్తుండటం విశేషం.  చైతూ .. మాధవన్ మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని చెబుతున్నారు.

 ఈ సినిమా ఫస్టులుక్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో 'ఫస్టు పంచ్' పేరుతో రేపు ఉదయం (శుక్రవారం) 10 గంటల 30 నిమిషాలకి ఈ సినిమా నుంచి ఫస్టు పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియపరుస్తూ వదిలిన పోస్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా వుంది. 'ప్రేమమ్' హిట్ తరువాత చందూ .. చైతూ కాంబినేషన్లో వస్తోన్న సినిమా కావడంతో, అందరిలోనూ ఎంతో ఆసక్తి వుంది.    
Go Back to Shorts
chaitu
nidhi agarwal

More Telugu News