నోరు పారేసుకున్న నరేష్ అగర్వాల్.. బీజేపీలో చేరిన కాసేపటికే మొట్టికాయలు!
- బీజేపీలో చేరిన సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత నరేష్ అగర్వాల్
- జయాబచ్చన్ పై విమర్శలు
- నరేష్ అగర్వాల్ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదన్న సుష్మ
ఈ సందర్భంగా మోదీ, ఆదిత్యనాథ్ లను పొగిడిన ఆయన, సమాజ్ వాదీ పార్టీపై విమర్శలు గుప్పించారు. తనకు టిక్కెట్ నిరాకరించి సినిమాల్లో డాన్సులు చేసే వాళ్లకు (జయాబచ్చన్) టిక్కెట్ ఇవ్వడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. సినిమాల్లో డాన్సర్ కారణంగా తాను టిక్కెట్ కోల్పోయానన్నారు. దీనిపై సుష్మాస్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్ అగర్వాల్ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్న సుష్మ, జయాబచ్చన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు.