షూటింగ్ కోసం మండుటెండలో పదిగంటలు సైకిల్‌పై సవారీ చేసిన హీరో!
- 'సుయ్ ధాగా' చిత్రంలోని ఓ సన్నివేశం కోసం హీరో కష్టం
- సింపుల్ వస్త్రధారణలో హీరోహీరోయిన్లు
- మధ్యప్రదేశ్‌లోని ఛండేరిలో షూటింగ్
ఈ సీన్‌లో హీరోహీరోయిన్లు ఇద్దరూ చాలా సింపుల్ వస్త్రధారణలోనే కనిపిస్తున్నారు. కథ డిమాండ్ మేరకు అలా సింపుల్‌గా కనిపించాల్సి వచ్చిందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. 'దమ్ లగా కే ఐసా' రచయిత శరత్ కటారియా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మనీశ్ శర్మ నిర్మాత. ఈ చిత్రంలో హీరో టైలర్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ ఏడాది సెప్టెంబరు 28న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.