శర్వానంద్ సినిమాకి టైటిల్ ను ఖరారు చేసేశారు
- హను రాఘవపూడితో శర్వానంద్
- ఆయన సరసన సాయిపల్లవి
- 'పడి పడి లేచే మనసు' టైటిల్ ఖరారు
అదే టైటిల్ ను ఖరారు చేశారనేది తాజా సమాచారం. రేపు ఈ సినిమా టైటిల్ లోగో పోస్టర్ ను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఇంతవరకూ తాను పోషించిన పాత్రలకి భిన్నంగా .. ఆర్మీ ఆఫీసర్ గా శర్వానంద్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. 'ఫిదా' .. 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' సినిమాలతో హిట్ కొట్టిన సాయి పల్లవి, ఈ సినిమాలో శర్వానంద్ తో జోడీ కడుతోంది. క్రేజీ కాంబినేషన్లో ఈ సినిమా రూపొందుతుండటంతో, అందరిలోనూ ఆత్రుత పెరుగుతూ వస్తోంది.