గూగుల్ లో సల్మాన్ కంటే సన్నీలియోన్ కోసమే ఎక్కువ వెతికారు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గూగుల్ లో సల్మాన్ కంటే సన్నీలియోన్ కోసమే ఎక్కువ వెతికారు!

  • గూగుల్ సెర్చ్ లో నెటిజన్లు ఎవరి కోసం ఎక్కువ వెతికారో వెల్లడించిన వికీపీడియా
  • 32 మందితో కూడిన జాబితా విడుదల
  • 2వ స్థానంలో షారూక్, 20లో సన్నీలియోన్, 29లో సల్మాన్
గూగుల్ ద్వారా వికీపీడియా సెర్చ్ లో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కంటే ఎక్కువగా సన్నీలియోన్ కోసమే వెతికడం ఆసక్తి రేపుతోంది. గత పదేళ్ల కాలంలో నెటిజన్లు బాలీవుడ్, హాలీవుడ్ లకు చెందిన ఏ సెలబ్రిటీ కోసం ఎక్కువగా శోధించారన్న వివరాలను వికీపీడియా వెల్లడించింది. 2007 నుంచి 2017 మధ్య కాలంలో నెటిజన్లు శోధించిన 32 మంది బాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది.

ఈ జాబితాలో ముగ్గురు బాలీవుడ్ నటులు స్థానం సంపాదించగా, ప్రముఖ హాలీవుడ్ నటులు లియోనార్డో డి కాప్రియో, బ్రాడ్‌ పిట్‌, టామ్‌ క్రూయిస్‌, ర్యాన్‌ రేనాల్డ్స్‌ వంటి అగ్రనటులను వెనక్కి నెట్టి మరీ బాలీవుడ్ బాద్షా షారూక్‌ ఖాన్ ద్వితీయ స్థానంలో నిలిచాడు. అగ్రస్థానంలో అమెరికన్ టీవీ నటి కిమ్ కర్దాషియన్ ఉండడం విశేషం. బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ ను వెనక్కి నెట్టి సన్నీలియోన్ 20వ స్థానంలో నిలవగా, సల్లూ భాయ్ 29వ స్థానంలో నిలిచాడు. 
sharukh khan
salman khan
Sunny Leone
wikipedia

More Telugu News