కమెడియన్ గా కొత్త ప్రాజెక్టులతో సునీల్ బిజీబిజీ!
- కమెడియన్‌గా మళ్లీ జోరుపెంచిన సునీల్
- వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
- సైరా నరసింహారెడ్డి, రవితేజ చిత్రాలతో ఫుల్ బిజీ
ఈ క్రమంలో అల్లరి నరేష్-భీమినేని శ్రీనివాసరావు కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రానికి అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మెగాస్టార్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రం, తేజ దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ హీరోగా రూపొందనున్న చిత్రం, రవితేజ-శ్రీనువైట్ల కాంబినేషన్ చిత్రం, జూనియర్ ఎన్‌టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ చిత్రంలోనూ సునీల్ నటించనున్నట్లు ఫిలింవర్గాల సమాచారం.