varma: శ్రీదేవి పాత్రను పోషించే నటి ఎక్కడా లేదు: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

షార్ట్స్‌లో చూడండి
తన అభిమాన నటి శ్రీదేవిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా తీస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఈ రోజు వర్మ స్వయంగా ఖండించారు. ఈ మేరకు తన ట్విట్టర్ పేజీలో తాజా ట్వీట్ తో ఆ వార్తలకు చెక్ పెట్టారు.

‘‘శ్రీదేవి జీవిత చరిత్రపై నేను ఒక సినిమా తీస్తున్నానంటూ మీడియాలో ఓ వర్గం పేర్కొన్నదంతా అవాస్తవం. ఈ విధమైన ప్రయత్నం చేయడం కూడా మూర్ఖత్వమే అవుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే శ్రీదేవి పాత్రను పోషించే నటీమణి ఎక్కడా లేదు’’ అని వర్మ తన ట్వీట్ లో స్పష్టం చేశారు.
Go Back to Shorts
varma
sridevi

More Telugu News