సీఎం, డిప్యూటీ సీఎం బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్.. స్థానిక పోరుపై చంద్రబాబు, పవన్ మంతనాలు
- ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ
- స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై ప్రధాన చర్చ
- శక్తిసామర్థ్యాల ఆధారంగానే సీట్ల పంపకంపై నిర్ణయం
- బీసీ రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు తర్వాతే ఎన్నికల షెడ్యూల్
- వైసీపీకి ఒక్క స్థానం దక్కకుండా చూడాలనే పట్టుదల
రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్య కీలక సమావేశం జరిగింది. మంగళవారం ఉదయం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. అనంతరం ముగ్గురు నేతలు బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.
స్థానిక ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కూటమి పక్షాలు కలిసికట్టుగా పనిచేయాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు సమాచారం. శాతం లెక్కలతో సంబంధం లేకుండా క్షేత్రస్థాయిలో ఏ పార్టీకి బలం ఉంటే వారికే సీట్లు కేటాయించాలనే అంశంపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. వైసీపీకి ఒక్క స్థానం కూడా దక్కకుండా చేయాలనే పట్టుదలతో కూటమి నేతలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. తొలి దశలో జరగనున్న నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికలపై ఈ చర్చలు కేంద్రీకృతమయ్యాయి.
రాబోయే శుక్రవారం సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఏ క్షణంలోనైనా స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని నేతలు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి కమిటీల ఏర్పాటు ద్వారా సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.