రాయలసీమ కుర్రాడిగా రాజ్ తరుణ్
- అనీష్ కృష్ణ దర్శకత్వంలో రాజ్ తరుణ్
- కథానాయికగా రిద్ధి కుమార్
- జూన్ 14వ తేదీన విడుదల
కథాపరంగా ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా అనంతపురంలో జరుగుతోంది. రాజ్ తరుణ్ సరసన రిద్ధి కుమార్ కథానాయికగా నటిస్తోంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమాను, జూన్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. కొంతకాలంగా సరైన హిట్ లేక డీలాపడిన రాజ్ తరుణ్, ఈ సినిమా సక్సెస్ పై ఆశలు పెట్టుకున్నాడు. ఇక తొలిపరిచయంగా రిద్ధికుమార్ కి ఈ సినిమా ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.