nani: అందుకే నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట!

షార్ట్స్‌లో చూడండి
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ ఒక సినిమా చేయనున్నట్టుగా ఆమధ్య వార్తలు వచ్చాయి. తమిళంలో విజయ్ హిట్ కొట్టిన 'తెరి' సినిమాకి ఇది రీమేక్ అనే టాక్ వినిపించింది. కానీ పవన్ తన పూర్తి సమయాన్ని రాజకీయాలకి కేటాయించాలని నిర్ణయించుకోవడంతో, ఈ ప్రాజెక్టు చేసే అవకాశం లేకుండాపోయింది. దాంతో సంతోష్ శ్రీనివాస్ .. నానిని కలిసి కథ వినిపించడం జరిగిందట.

 ఈ ప్రాజెక్టు చేయడానికి నాని అంగీకరించాడనేది తాజా సమాచారం. సంతోష్ శ్రీనివాస్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమా 'కందిరీగ' మాత్రమే. ఆ తరువాత ఆయన చేసిన 'రభస' .. 'హైపర్' సినిమాలు పరాజయం పాలయ్యాయి. అయినా ఆయనతో సినిమా చేయడానికి నాని అంగీకరించడానికి కారణం బ్యానర్ కి గల వాల్యూ అని అంటున్నారు. కథా కథనాలపై వాళ్లు పెట్టే ప్రత్యేక శ్రద్ధపై గల నమ్మకంతోనే నాని ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పేశాడని అంటున్నారు. అయితే ఇది పవన్ కోసం అనుకున్న కథేనా? కాదా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది.    
Go Back to Shorts
nani
santhosh srinivas

More Telugu News