Sridevi: శ్రీదేవికి మద్యం సేవించే అలవాటు లేదు!: మాజీ ఎంపీ అమర్ సింగ్

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ నటి శ్రీదేవి బాత్ రూమ్‌లోని టబ్‌లో మునిగి చనిపోయినట్లు దుబాయ్ వైద్యులు నిర్ధారించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమె మద్యం తీసుకుని వున్నారని, దీంతో పట్టు తప్పి నీళ్లలో పడిపోయారని ఫోరెన్సిక్‌ నివేదికలో పేర్కొనడం విదితమే. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ అమర్ సింగ్ స్పందించారు. శ్రీదేవికి మద్యం సేవించే అలవాటు లేదని, అప్పుడప్పుడు వైన్ మాత్రం తీసుకుంటుందని చెప్పారు. శ్రీదేవి భౌతిక కాయం భారత్ కు తరలించే విషయమై దుబాయ్ షేక్ అల్ నహ్యాన్ తో తాను మాట్లాడానని, ఫార్మాలిటీస్ త్వరగా పూర్తి చేస్తామని చెప్పారని, ఈ అర్ధరాత్రికి ఆమె భౌతికకాయం ఇక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్నట్టు చెప్పారు.
Go Back to Shorts
Sridevi
dubai

More Telugu News