శ్రీదేవికి శోభన్ బాబు ముందుగానే చెప్పారట .. ఆమె ఆ మాట మరిచిపోలేదు!
- శోభన్ బాబు సినిమాలో బాలనటిగా శ్రీదేవి
- ఆ తరువాత ఆయన సరసన కథానాయిక
- ఈ జంట నుంచి సూపర్ హిట్స్
శోభన్ బాబు 'నా తమ్ముడు ' సినిమాలో శ్రీదేవి బాలనటిగా నటించారు. ఈ సినిమాలో ఆమె నటనను దగ్గరగా చూసిన శోభన్ బాబు 'నువ్ తప్పకుండా పెద్ద హీరోయిన్ అవుతావు' అన్నారట. ఆ తరువాత కాలంలో ఆయన సరసన తొలిసారిగా ఆమె 'కార్తీకదీపం' సినిమా చేశారు. ఈ సినిమా షూటింగ్ తొలిరోజున గతంలో శోభన్ బాబు అన్నమాటను గుర్తుచేస్తూ ఆయన కాళ్లకు శ్రీదేవి నమస్కరించిందట. ఆ తరువాత ఈ జంట నుంచి వచ్చిన ఎన్నో హిట్స్ ఆడియన్స్ ను అలరించాయి.