sridevi: శ్రీదేవీ, నీవెందుకు ఏడుస్తున్నావు.. నీవు చేసిన పనికి మేము ఆ పని చేస్తున్నాం!: రామ్ గోపాల్ వర్మ

షార్ట్స్‌లో చూడండి
తన అభిమాన నటి శ్రీదేవి మరణవార్తతో తీవ్రంగా కలత చెందిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ... వరుసగా ట్వీట్లు చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'క్షణక్షణం' చిత్రంలో శ్రీదేవి కంటతడి పెట్టిన ఫోటోను పోస్ట్ చేసిన ఆయన... 'శ్రీదేవి నీవెందుకు ఏడుస్తున్నావు? నీవు మమ్మల్నందరినీ వదిలేసి దూరంగా వెళ్లిపోయినందుకు... ఆ పని మేము చేస్తున్నాం' అంటూ ట్వీట్ చేశాడు. తాను సినిమాల్లోకి రావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే... ఆమెను అతి దగ్గర నుంచి చూడవచ్చనే ఆశే అని చెప్పారు. 'క్షణక్షణం' సినిమా శ్రీదేవికి తన ప్రేమలేఖ వంటిదని తెలిపారు.
.'ఈసారి ఆ దేవుడే ఒక జామురాతిరి ఆ జాబిలమ్మకు శాశ్వతంగా జోలపాడాడు. తన జాజికొమ్మను ఎక్కువకాలం భూలోకంలో ఉంచలేక శాశ్వతంగా తన దరికి చేర్చుకున్నాడు' అంటూ ట్వీట్ చేశారు.
Go Back to Shorts
sridevi
death
ram gopal varma

More Telugu News