chiranjeevi: చరణ్ సినిమా విషయంలో బోయపాటికి మెగాస్టార్ రెండు సూచనలు!

షార్ట్స్‌లో చూడండి
చరణ్ హీరోగా బోయపాటి శ్రీను ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఇంకా పేరు ఖరారు చేయని ఈ సినిమా, ఇటీవలే ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ నెల రెండవ వారం నుంచి రెండవ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి బోయపాటి శ్రీనుకి చిరంజీవి రెండు విషయాలను స్పష్టం చేశారట.

"కథను బట్టి యాక్షన్ సీన్స్ చేయండి .. రక్తపాతం వుండకూడదు. అలాగే కామెడీకి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం మరిచిపోవద్దు" అని చెప్పారట. సాధారణంగా బోయపాటి సినిమాల్లో రక్తపాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే కామెడీ ఎపిసోడ్స్ విషయంలో బోయపాటి పెద్దగా దృష్టి పెట్టరు. ఈ విషయాలను గ్రహించిన చిరంజీవి .. ముందుగానే బోయపాటికి ఈ విషయం చెప్పారట. ఆయన సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకోవడంపై బోయపాటి దృష్టి పెట్టారనే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది. 
Go Back to Shorts
chiranjeevi
charan

More Telugu News