వాట్సాప్, ఫేస్ బుక్ ద్వారా కీలక సమాచారం లీక్... ఎయిర్ ఫోర్స్ అధికారి అరెస్ట్

  • ఎయిర్ ఫోర్స్ అధికారికి ఓ మహిళ వల
  • సాధారణ నిఘాలో బయటపడిన విషయం
  • విచారణ చేపట్టిన అధికారులు
దేశ భద్రతకు పాటుపడాల్సిన వాయిసేన అధికారి ఓ మహిళ వలలో చిక్కుకుని కీలక సమాచారాన్ని వాట్సాప్, ఫేస్ బుక్ ద్వారా చేరవేస్తున్న విషయం వెలుగు చూసింది. అధికార వర్గాల సమాచారం మేరకు.... ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ ప్రధాన కార్యాలయంలో గ్రూపు కెప్టెన్ అధికారిగా పనిచేస్తున్న వ్యక్తికి గూఢచారిగా భావిస్తున్న ఓ మహిళ ఫేస్ బుక్ ద్వారా దగ్గరయ్యింది.

అధికారిక సమాచారాన్ని ఆ అధికారి ఆమెకు ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా చేరవేసినట్టు భావిస్తున్నారు. సాధారణ నిఘాలో భాగంగా ఈ విషయం బయటపడింది. దీంతో సదరు అధికారిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. కీలక సమాచారం బయటకు వెళ్లిపోయిన ఈ ఘటనలో ఇతరుల ప్రమేయం కూడా ఏమైనా ఉందా? అన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు. భద్రతా దళాల్లో పనిచేస్తున్న వారికి సామాజిక మాధ్యమాల్లో కంటెంట్ షేరింగ్ పై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి.
Go Back to Shorts
airforce
whatsapp

More Telugu News