కొత్త కథల కోసం శర్వానంద్ కొత్త ప్లాన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొత్త కథల కోసం శర్వానంద్ కొత్త ప్లాన్

  • వైవిధ్యభరితమైన కథలపై శర్వానంద్ దృష్టి 
  • రచయితల టీమ్ ను ఏర్పాటు చేసే ఆలోచన 
  • ప్రాజెక్టుల విషయంలో ఆలస్యం కాకూడదనే ఈ నిర్ణయం 
మొదటి నుంచి కూడా శర్వానంద్ విభిన్నమైన .. విలక్షణమైన కథలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. ఆయన ఖాతాలో ఎక్కువ సక్సెస్ లు ఉండటానికీ .. హీరోగా ఆయన నిలదొక్కుకోవడానికి ఇదే కారణం. అలాంటి శర్వానంద్ తాజాగా ఒక ప్లాన్ చేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్. కొంతమంది రైటర్లను ఒక టీమ్ గా ఏర్పాటు చేసి వైవిధ్యభరితమైన కొత్త కథలను రూపొందించే పనిని అప్పగించినట్టు సమాచారం.

అలా రైటర్స్ రెడీ చేసిన కొత్త కథలతో శర్వానంద్ ఒక స్టోరీ బ్యాంక్ ను ఏర్పాటు చేస్తాడట. తనతో సినిమా చేయాలనుకున్న వారికి ముందుగా తన దగ్గరున్న కథలను వినిపించి, వాళ్లకి నచ్చితే సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అన్నట్టుగా ఆయన రెడీ అవుతున్నాడని అంటున్నారు. ఈ విధంగా చేయడం వలన కథలపై తనకి పూర్తి అవగాహన ఉండటమే కాకుండా .. ప్రాజెక్టుల విషయంలో ఆలస్యం కాకుండా ఉంటుందని భావిస్తున్నాడట. శర్వానంద్ కొత్త ప్లాన్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.  
sharwanand

More Telugu News