ఒకే ఫ్రేమ్ లో కాజోల్, మాధురీ దీక్షిత్, సోనాలీ బింద్రే... వైరల్ అవుతున్న ఫోటో!

  • అశేష సినీ అభిమానులను అలరించిన హీరోయిన్స్
  • తాజా చిత్రాన్ని చూసి అభిమానులు ఫిదా
  • తమను పాతికేళ్లు వెనక్కు తీసుకెళ్లారని వ్యాఖ్యలు
1990వ దశకంలో భారత అశేష సినీ అభిమానులను అలరించిన నటీమణుల త్రయం మాధురీ దీక్షిత్, సోనాలీ బింద్రే, కాజోల్ లు ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కలసి సెల్ఫీలు దిగగా, అవిప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ ముగ్గురు అందాల తారల ఫోటోను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్ హోత్రా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ ఫోటోను చూసిన వారు ఫిదా అవుతూ, తాము ఓ పాతికేళ్లు వెనక్కు వెళ్లినట్టుగా ఉందని వ్యాఖ్యానిస్తుండటం విశేషం. మాధురి ప్రస్తుతం ఓ మరాఠీ చిత్రంలో నటించేందుకు సన్నద్ధం అవుతుండగా, కాజోల్, ధనుష్ హీరోగా నటించిన 'వీఐపీ-2'లో ఇటీవల కనిపించింది. సోనాలీ బింద్రే సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. వీరు ముగ్గురూ కలసి కనిపిస్తున్న చిత్రాన్ని మీరూ చూడవచ్చు.
Go Back to Shorts
Madhuri Dikshit
Kajol
Sonali
Manish Malhotra

More Telugu News