Chiranjeevi: వచ్చే నెల నుంచి ‘సైరా’ సెకండ్ షెడ్యూల్: మెగాస్టార్ చిరంజీవి

షార్ట్స్‌లో చూడండి
మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను చిరంజీవి పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నట్టు చిరంజీవి ప్రకటించారు.

సంక్రాంతి సందర్భంగా తన అభిమానులకు, ప్రేక్షకులకు, తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో కళకళలాడాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. కాగా, ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ పొలాచ్చిలో ప్రారంభమవుతుందని సమాచారం. గత ఏడాది ఆగస్టు 16న ఈ చిత్రం ప్రారంభమైంది. చిరంజీవి 62వ పుట్టినరోజు సందర్భంగా గత ఏడాది ఆగస్టు 22న ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. డిసెంబరు 6న స్టంట్ మాస్టర్ లీ విట్టెకర్ దర్శకత్వంలో ఒక కీలక పోరాట సన్నివేశంతో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించారు.
Go Back to Shorts
Chiranjeevi
saira

More Telugu News