‘న్యూ లుక్’లో మెగాస్టార్ చిరంజీవి !
- ‘సైరా’ కోసం న్యూలుక్
- క్లీన్ షేవ్ తో చిరు
- ‘జువ్వ’ టీజర్ రిలీజ్ చేసిన చిరంజీవి
ఈ సందర్భంగా ‘న్యూలుక్’లో ఉన్న చిరంజీవిని చూసేందుకు అభిమానులు మరింత ఆసక్తి చూపారు. కాగా, న్యూ ఇయర్ వేడుకల సమయంలో గడ్డం లేకుండా కనిపించిన చిరంజీవి, ఆ తర్వాత గ్రాఫిక్స్ వర్క్స్ నిమిత్తం మీసం కూడా తీసేశారని సమాచారం. ‘సైరా నరసింహారెడ్డి’ రెండో షెడ్యూల్ పొల్లాచ్చిలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ ప్రారంభం కావడానికి మరికొంత సమయం ఉండటంతో ఈలోగా గ్రాఫిక్స్ కు కావాల్సిన త్రీడీ ఇమేజెస్ కోసం మెగాస్టార్ న్యూలుక్ లోకి మారారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
ఇదిలా ఉండగా, ‘జువ్వ’ టీజర్ రిలీజ్ చేసిన చిరంజీవి మాట్లాడుతూ, ఈ సినిమా అందరినీ అలరిస్తుందని తనకు నమ్మకం ఉందని, అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ సినిమా తీశారని అన్నారు. కొత్త ఒరవడితో, యువతరం సినీ రంగంలోకి వస్తేనే ఆ తాజాదనం ఉంటుందని, కొత్త పుంతలు తొక్కుతుందని అన్నారు.