ఆ పాత్ర చేయడం నాకు ఇష్టం లేదు .. అయినా తప్పలేదు!: ఆమని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ పాత్ర చేయడం నాకు ఇష్టం లేదు .. అయినా తప్పలేదు!: ఆమని

  • తెలుగులో నా మొదటి సినిమా 'ఆడది'
  • కథ ఏమిటని నేను అడగలేదు 
  • మొదటి రోజునే నేను చాలా హర్ట్ అయ్యాను     
తాజాగా ఐ డ్రీమ్స్ తో ఆమని మాట్లాడుతూ .. తన కెరియర్లో తనకి బాధను కలిగించిన ఒక సంఘటనను గురించి ప్రస్తావించారు. " తెలుగులో 'జంబలకిడి పంబ' సినిమా కంటే ముందు నేను 'ఆడది' అనే సినిమా చేశాను. అందులో నాది మెయిన్ రోల్ కాదు .. వ్యాంపిష్ రోల్. నేను తమిళ సినిమాలు చేస్తుండగానే ఈ సినిమాలో ఆఫర్ వచ్చింది.

వీడియో టెస్ట్ చేసి సెకండ్ హీరోయిన్ పాత్ర .. మోడ్రన్ గా ఉంటుందని అన్నారు. మోహన్ గాంధీ .. పరుచూరి బ్రదర్స్ కాంబినేషన్ అనడంతో, కథ ఏమిటని అడగలేదు .. నా పాత్ర గురించి తెలుసుకోనూ లేదు. షూటింగ్ మొదటి రోజునే నేను చాలా హర్ట్ అయ్యాను. ఆ పాత్ర నాకు ఇష్టం లేకపోవడంతో ఎక్స్ ప్రెషన్స్ రావడం లేదు. వాళ్లేమో నాకు యాక్టింగ్ రావడం లేదని అనుకున్నారు. కమిటైపోయాను కదా అని చేశాను. ఆ సినిమా ఆడకపోవడం నేను అదృష్టంగానే భావించాను" అంటూ చెప్పుకొచ్చారు.      
amani

More Telugu News