అమితాబ్ ఇంటి నుంచి వేరు పడుతున్న ఐశ్వర్య, అభిషేక్?
- కొత్త ఇంట్లోకి మారబోతున్న జంట
- ముంబైలోని బాంద్రా కుర్లా ప్రాంతంలో అపార్ట్‌మెంట్
- రూ. 21 కోట్లు పెట్టి కొన్న అభి, ఐష్
ఈ కొత్త ఇంట్లో అభిషేక్, ఐష్, వారి కూతురు ఆరాధ్య నివసించనున్నారు. 2015లో ఈ అపార్ట్‌మెంట్‌ను అభిషేక్, ఐష్‌లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ అపార్ట్‌మెంట్ ఉన్న ప్రాంతంలోనే ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్, సోనమ్ కపూర్‌ల అపార్ట్‌మెంట్లు కూడా ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని ఆసరాగా చేసుకుని బిగ్‌బీ ఇంట్లో గొడవలు వచ్చాయని, అందుకే 2015లో కొన్న అపార్ట్‌మెంట్‌లోకి ఐష్, అభిలు ఇప్పుడు మారుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు అమితాబ్, జయాబచ్చన్‌లతో కలిసి ఐష్, అభి, ఆరాధ్యలు `జల్సా`లో నివాసం ఉన్న సంగతి తెలిసిందే.