allari naresh: హిట్ ఇచ్చిన దర్శకుడితో అల్లరి నరేశ్!

షార్ట్స్‌లో చూడండి
కొంత కాలంగా అల్లరి నరేశ్ తో సక్సెస్ అనేది దాగుడుమూతలు ఆడుతోంది. కొత్తదనం కోసం ఆయన ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా ప్రయోజనం కనిపించడం లేదు. దాంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన వున్నాడు. ఈ నేపథ్యంలోనే దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు ఆయనకి ఒక కథ వినిపించారట. ఇంతవరకూ తాను చేయని పాత్ర కావడంతో .. ప్రేక్షకులు ఆశించే కొత్తదనం ఉందని భావించడంతో వెంటనే ఓకే చెప్పేశాడట.

 జనవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆరంభించే దిశగా సన్నాహాలను మొదలుపెట్టినట్టు సమాచారం. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సుడిగాడు' హిట్ కావడంతో, అందరిలోనూ ఆసక్తి పెరగడం ఖాయం. ఈ సినిమాలో కథానాయిక ఎవరనే విషయాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు చేయడానికి అల్లరి నరేశ్ రెడీ అవుతుండటం విశేషం.     
Go Back to Shorts
allari naresh
bheemaneni

More Telugu News