కోలీవుడ్ హీరో ప్రేమలో పడిన హన్సిక?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోలీవుడ్ హీరో ప్రేమలో పడిన హన్సిక?

  • శింబుతో కొనసాగిన ప్రేమాయణం 
  • ఆ తరువాత తలెత్తిన విభేదాలు 
  • జయం రవి .. సిద్ధార్థ్ తోను లవ్ ఎఫైర్స్ 
  • తాజాగా తెరపైకి 'అధర్వ' పేరు  
అందం అంటే హన్సికదే అని తమిళ ప్రేక్షకులు చెప్పుకునేలా ఆమె చేయగలిగింది. అడపాదడపా తెలుగు సినిమాలు చేస్తూనే, తమిళంలో నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకోగలిగింది. అలాంటి హన్సిక అక్కడ ఓ యంగ్ హీరోతో ప్రేమలో పడినట్టుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి .. ఆ హీరో ఎవరో కాదు 'అధర్వ'.

కోలీవుడ్ లో గతంలో శింబుతో హన్సిక కొనసాగించిన ప్రేమాయణం పెద్ద రచ్చగా మారిపోయింది. ఆ తరువాత ఇద్దరూ విడిపోవడం కూడా అందరికీ తెలిసేలానే జరిగింది. ఆ తరువాత 'జయం రవి'తో హన్సిక ప్రేమలో పడినట్టుగా .. ఈ విషయం కారణంగా జయం రవి ఫ్యామిలిలో గొడవలు జరిగినట్టుగా చెప్పుకున్నారు. ఆ తరువాత సిద్ధార్థ్ తోను హన్సిక ఎఫైర్ ను కొనసాగించినట్టుగా వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు హన్సిక లవర్ గా 'అధర్వ' పేరు తెరపైకి వచ్చింది. పై ముగ్గురు హీరోలతో హన్సిక సినిమాలు చేస్తుండగా లవ్ అఫైర్ నడిచిందని అంటారు. కానీ ఇంతవరకూ ఆమె అధర్వతో ఒక్క సినిమా కూడా చేయకముందే, ఈ జంట లవ్ లో పడినట్టుగా వార్తలు రావడం విశేషం.          
adharva
hansika

More Telugu News