మరోసారి క్రాష్ అయిన వాట్సాప్!
- ఈ ఉదయం క్రాష్ అయిన వాట్సాప్
- ఉత్తర యూరప్, బ్రెజిల్ లో ఎక్కువ సమస్య
- సమస్యను గుర్తించే పనిలో ఉన్నామన్న వాట్సాప్
ఈ రోజు దాదాపు గంట సమయం పాటు సర్వీసులు నిలిచిపోయాయని, ఆ తర్వాత సర్వీసుల పునరుద్ధరణ జరిగిందని యూజర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్ల నుంచి #వాట్సాప్ డౌన్ అనే మెసేజ్ లు ట్విట్టర్లో వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఉత్తర యూరప్, బ్రెజిల్ లో ఈ సమస్య ఎక్కువగా తలెత్తింది. దీనిపై వాట్సాప్ ప్రతినిధులు స్పందించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ యూజర్లు యాప్ ను యాక్సెస్ చేసుకోలేకపోతున్నారని... సమస్యను గుర్తించే పనిలో ఉన్నామని తెలిపారు.