Online Prostitution: వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ తెలుగు టీవీ నటి అరెస్ట్!

  • ఆన్ లైన్ లో విటులను ఆకర్షిస్తున్న బ్రోకర్లు
  • బుక్ చేసుకున్న వ్యక్తి దగ్గరికి నటి
  • మల్కాజ్ గిరి ఎస్ వోటీ పోలీసులు రంగంలోకి
  • నటి, బ్రోకర్ అరెస్ట్
ఆన్‌ లైన్‌ మాధ్యమంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ తెలుగు టీవీ నటి పోలీసులకు పట్టుబడింది. ఉప్పల్ పోలీసులు తెలిపిన మరిన్ని వివరాల ప్రకారం, కృష్ణానగర్‌ కు చెందిన సోయల్‌, రెడ్డి నరేష్ నాయుడు అనే ఇద్దరూ ఆన్ లైన్ లో ప్రకటనలు ఇచ్చి విటులను ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి, బుల్లితెర నటి చిత్రాన్ని చూసి ఆమెను బుక్ చేసుకోగా, ఆమెను ఉప్పల్‌ ప్రశాంత్‌ నగర్‌ కు పంపించారు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న మల్కాజ్ గిరి ఎస్‌ వోటీ విభాగం పోలీసులు, ప్రశాంత్‌ నగర్‌ రోడ్డులో బుక్ చేసుకున్న విటుడి కోసం వేచిచూస్తుండగా, నటితో పాటు రెడ్డి నరేష్ నాయుడిని అరెస్ట్ చేశారు. ఆపై వారిని ఉప్పల్ పోలీసులకు అప్పగించామని, కేసు నమోదు చేశామని తెలిపారు.
Online Prostitution
telugu TV actress
Uppal
Krishna Nagar

More Telugu News