Chiranjeevi: 'సైరా' నుంచి రెహమాన్ తప్పుకోవడంపై తాజా సందేహాలు!

షార్ట్స్‌లో చూడండి
చిరంజీవి 151వ సినిమాగా 'సైరా' త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని తీసుకున్నారు. జాతీయస్థాయిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనతో టెక్నీషియన్స్ విషయంలోనూ రాజీ పడటం లేదు. ఈ నేపథ్యంలోనే సంగీత దర్శకుడిగా ఏ.ఆర్.రెహ్మాన్ ను అనుకున్నారు.

 తాజాగా ఓ మ్యూజిక్ కన్సర్ట్ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన రెహ్మాన్, ఈ సినిమాకి తాను పనిచేయడం లేదని చెప్పాడు. చిరంజీవి అంటే తనకి ఎంతో అభిమానమనీ, ఆయన సినిమాకి పనిచేసే ఛాన్స్ వచ్చినా బిజీ షెడ్యూల్ కారణంగా చేయలేకపోతున్నానని అన్నాడు. అయితే తాజాగా ఆయన మలయాళంలో 'ఆడు జీవితం' అనే సినిమాకి సంగీతాన్ని అందించడానికి అంగీకరించాడు. పృథ్వీరాజ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. 'సైరా' సినిమాకి డేట్స్ ఖాళీ లేవని చెప్పిన రెహమాన్ .. మలయాళ సినిమాకి ఓకే చెప్పడమే అందరిలో సందేహాన్ని రేకెత్తిస్తోంది.         
Go Back to Shorts
Chiranjeevi
nayantara

More Telugu News