సోదరుడి పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ హన్సిక హుషారు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సోదరుడి పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ హన్సిక హుషారు!

  • పంజాబీ సంప్రదాయం ప్రకారం పెళ్లి
  • అంద‌రినీ ఉత్సాహ‌ప‌ర్చిన  హన్సిక
  • సోష‌ల్ మీడియాలో ఫొటోలు
హీరోయిన్ హన్సిక త‌న సోద‌రుడి పెళ్లి వేడుక‌లో సంద‌డి చేసింది. కుటుంబ సభ్యులతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేస్తూ అంద‌రినీ అల‌రించింది. పంజాబీ సంప్రదాయం ప్రకారం త‌న సోద‌రుడి పెళ్లి జ‌రుగుతుండ‌గా తీసిన ఫొటోల‌ను ఆమె త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది.

తన వదినను కుటుంబంలోకి సంతోషంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. ఈ పెళ్లి వేడుకకు ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా హాజ‌ర‌యిన‌ట్లు తెలుస్తోంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప‌లు సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించిన హన్సిక మంచి గుర్తింపు తెచ్చుకున్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం ఈ భామ‌ ప్రభుదేవాతో కలిసి ఓ తమిళ సినిమాలో న‌టిస్తోంది.
hansika
dance
marriage

More Telugu News